Showing posts with label PHOTOS. Show all posts
Showing posts with label PHOTOS. Show all posts

Tuesday, 27 September 2011

బద్ది సంస్మరణ సభలో అద్దేపల్లి

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో 25 సెప్టెంబర్ 2011 ,ఆదివారం సాయంకాలం 5 .గంటలకు హోటల్ విజయ రెసిడెన్సీ లో బద్ది నాగేశ్వర రావు గారి  సంస్మరణ సభ ఘనంగా జరిగింది.  డా.అద్దేపల్లి రామమోహన్ రావు గారు ఈ సభకు ముఖ్య అతిథిగా,అధ్యక్షునిగా వ్యవహరించారు.తొలుత సభకు విచ్చేసినవారు ఒక నిమిషం మౌనం పాటించి బద్ది వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఆతర్వాత బద్దివారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.బద్దివారి సాహితీ సంపుటులను సమీక్షించి...వివిధ సాహితీ సంస్థల ప్రముఖులు బద్దివారి సాహితీ సేవలను తలుచుకొని సాహితీ రంగానికి బద్దివారి మరణం తీరని లోటుగా ఆవేదన వ్యక్తం చేశారు. డా.తలతోటి పృథ్వీ రాజ్ బద్ది చాయా చిత్రాలతో రూపొందించిన power point presentation సభను ఆకట్టుకుంది. పృథ్వీ రాజ్ రూపొందించిన http://baddinageswararao.blogspot.com అనే బ్లాగ్ ను ప్రముఖ కవి శ్రీ అద్దేపల్లి రామమోహన్   రావు ఆవిష్కరించారు. పెద్దఎత్తున కవులు తమ ప్రగాఢ సానుభూతిని బద్ది కుటుంబసభ్యులకు తెలియజేసారు.













ఆధునిక కవిత్వంపై అద్దేపల్లి శిక్షణ



ఇండియన్ హైకూ క్లబ్ సంక్రాంతి పురస్కార గ్రహీతగా అద్దేపల్లి